ప్రైవేటు పాఠశాలల సంఘంలో నూతన కార్యవర్గం.!
డివిజన్ అధ్యక్షుడిగా మరోసారి పసుపులేటి నాగేశ్వరరావు ఏకగ్రీవం.
సత్తుపల్లి, డిసెంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం సత్తుపల్లి డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్సీ భవనం ల్లో సజావుగా జరిగాయి. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడిగా విశ్వశాంతి విద్యాలయం ప్రతినిధి పసుపులేటి నాగేశ్వరరావును మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన పాలకొల్లు శ్రీనివాసరావు, శ్రీ సత్య సాయి విద్యానికేతన్‌కు చెందిన గొబ్బూరి నాగరాజు ఎంపికయ్యారు. కార్యదర్శిగా లక్ష్యా స్కూల్‌కి చెందిన ఈశ్వర్, కోశాధికారిగా గీతాంజలి స్కూల్‌కి చెందిన చీకటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.
సంయుక్త కార్యదర్శులుగా చైతన్య స్కూల్‌కు చెందిన ఎదుళ్ల మురళీకృష్ణ, సరస్వతి స్కూల్‌కు చెందిన జుజ్జురి చెన్నారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ప్రతిభా స్కూల్ నిర్వాహకుడు లక్కినేని ప్రసాద్, గౌరవ సలహాదారులుగా కేపిఆర్ గౌతమ్ మోడల్ స్కూల్‌కు చెందిన మందపాటి ప్రభాకర్ రెడ్డి, సెంచరీ స్కూల్‌కు చెందిన కృష్ణారావు నియమితులయ్యారు. ఎన్నికలను సంఘ జిల్లా కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు, రాష్ట్ర బాధ్యులు ఇస్మాయిల్, లక్కినేని ప్రసాద్ పర్యవేక్షించారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు మండలాలకు చెందిన అనేక ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.


Comments