బీ. ఆర్ ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ

బీ. ఆర్ ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ

....మంత్రి తుమ్మల సమర్ధ నాయకత్వంలో పనిచేసేందుకు కాంగ్రెస్ గూటికి 8 మంది కార్పొరేటర్లు

బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

.....మంత్రి తుమ్మల మరియు కార్పొరేటర్లను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి 

 ఖమ్మం బ్యూరో, జనవరి 7(తెలంగాణ ముచ్చట్లు)

బీ.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి తుమ్మల వెంట వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
33 వ డివిజన్ కార్పొరేటర్ తోట ఉమారాణి వీరభద్రం 34 వ డివిజన్ కార్పొరేటర్ రుద్రగాని  శ్రీదేవి ఉపేందర్ 
17 వ డివిజన్ కార్పొరేటర్ ధనియాల రాధ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మరియు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.. 

....ఖమ్మం అబివృద్ధి పరుగులు పెట్టాలి...సీఎం రేవంత్ 

 ఖమ్మం నగర అబివృద్ధి ఇక పరుగులు పెట్టాలని మంత్రి తుమ్మల అబివృద్ధి బాటలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. IMG-20260107-WA0109

బీ.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్

 రెండు రోజుల వ్యవధిలో బీ ఆర్.ఎస్ పార్టీ నుంచి 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. సోమవారం నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా బుధవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పాత కొత్త కార్పొరేటర్లు అందరూ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసారు.ఖమ్మం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్లు విజ్ఞప్తి చేయగా మంత్రి తుమ్మల నాయకత్వంలో ఖమ్మం నగరం మోడల్ గా అబివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు