లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మందికి అన్నదానం.!
సత్తుపల్లిలో 11 రోజులపాటు అంగర్ సర్వీస్.
సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
లయన్స్ క్లబ్ సత్తుపల్లి ఆధ్వర్యంలో అంగర్ సర్వీస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో 200 మంది నిరుపేదలకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం 11 రోజులపాటు కొనసాగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోగడ రమేష్ తెలిపారు.
ఈ అన్నదాన కార్యక్రమాన్ని తపాలా శాఖ ఏరియా మేనేజర్ రాజేష్, విశ్వశాంతి విద్యాలయం కరస్పాండెంట్ పసుపులేటి నాగేశ్వరరావు ప్రారంభించారు. సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు మందపాటి ప్రభాకర్ రెడ్డి, కొత్తూరు ప్రభాకర్ రావు, చల్లగుండ్ల అప్పారావు, తోట రమేష్, పెనుగొండ రమేష్, మందపాటి చెన్నారెడ్డి, ఎస్‌కే వలి, మిద్దె శ్రీను, గార్లపాటి సత్యనారాయణ, వహీద్, హైమద్, చావా మనోజ్, రహమద్, పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. 


Comments