ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్.

రూ.15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత.

ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్.

హాసన్ పర్తి,జనవరి 08(తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరధిలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కాడు.పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని వేధిస్తూ కేసును తేలిక చేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం గురువారం రూ.15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐ శ్రీకాంత్‌ను పట్టుకున్నారు.ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు