ప్రభుత్వ స్కూల్లో బోరు మరియు మోటారు ఏర్పాటు చేసిన దాతలకు ఘన సన్మానం

ఖమ్మం బ్యూరో, జనవరి 08(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం అర్బన్ మండలంలో గల జిపిఎస్ సంభాని నగర్ పాఠశాలయందు దాదాపు రూ. 80,000/- (ఎనభై వేల రూపాయలు) ఖర్చుతో బోరు వేయించి మోటార్ ఏర్పాటు చేయించి దాతృత్వం చాటుకున్న దాతలు మిత్ర ఫౌండేషన్ అధ్యక్షులు కురువెళ్ళ ప్రవీణ్ కుమార్ 40000 రూపాయలు విలువ గల మోటర్ దాత ను, అదేవిధంగా బోర్ వేయించి మరో రూ.40,000/- విలువైన ఖర్చు పంచుకొన్న 19వ డివిజన్ కార్పోరేటర్ సిహెచ్ వెంకట నారాయణ మరియు పాఠశాల ఉపాధ్యాయురాలు సూర్యకుమారి మేడం ని కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరి మరియు పాఠశాల సిబ్బంది, విద్యాశాఖ పక్షాన మండల విద్యాశాఖ అధికారి. శైలజా లక్ష్మి , ఏ ఎం ఓ పెసర ప్రభాకర్ రెడ్డి , సీఎంఓ ప్రవీణ్ కుమార్ , కాంప్లెక్స్ హెచ్ఎం సిహెచ్ కృపాబాలానందం సన్మానించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొనిన ఏ ఎం ఓ పెసర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కురువెళ్ళ ప్రవీణ్ కుమార్ , కార్పోరేటర్ వెంకట నారాయణ మరియు సూర్యకుమారి దాతృత్వ గుణాన్ని ప్రశంసించారు. పాఠశాల భౌతిక వసతులు మెరుగుపరచడంలో కేవలం ప్రభుత్వమే గాకుండా ఇలాంటి దాతల సహకారం ద్వారానే మెరుగైన వసతులు ఏర్పడి అభ్యసనాభివృద్దికి తోడ్పడతాయని సీఎమ్ఓ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మెరుగైన వసతుల రూపకల్పనకు కృషిచేస్తున్న మా ఉపాధ్యాయులను ఎంఈఓ శైలజాలక్ష్మి అభినందించారు.
పాఠశాల అవసరాలు విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు పెంపొందించడంలో కృషి చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల అభివృద్ధి కొరకు సహకరిస్తున్న దాతలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చల్లగాని కృపాబాలానందం కొనియాడారు. కార్యక్రమాన్ని కూచావల్లాల్ ప్రధానోపాధ్యాయులు జీవన్ నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ ను కూడా ఇప్పిస్తానని బండి నాగేశ్వర్ రావు ని కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పై వారితో పాటు మా పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.కె పర్వీన్, బి. ఉష, కె. మీనా, సి ఆర్ పి హారిక, విద్యార్ధుల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్మన్ టి. అరుంధతి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసి దాతలను ఘనంగా సన్మాఇంచిన, మమ్ములను అభినందించిన, మా పిల్లలను ప్రోత్సహించిన అధికారులు ఏ ఎం ఓ పెసర ప్రభాకర్ రెడ్డి కి, సీఎంఓ ప్రవీణ్ కుమార్ కి, ఎంఈఓ ఖమ్మం అర్బన్ మండలం ఏ వి శైలజాలక్ష్మీ కి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చల్లగాని కృపాబాలానందం కి, జీవన్ కి, బండి నాగేశ్వరరావు కి, అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకున్నారు


Comments