వేములపల్లిలో పింఛన్ పంపిణీ
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్ అనిత
వేలేరు 28 డిసెంబర్ 2025 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామ పరిధిలోని ఆమ్లెట్ గ్రామం వేములపల్లికి చెందిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి వితంతులు ప్రతి నెలా పింఛన్ డబ్బుల కోసం పీచర వరకు రావాల్సి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పీచర గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మరిజే అనిత – నరసింహారావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకరోజు వేములపల్లికి వచ్చి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ పంపిణీ చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు (ఆదివారం) వేములపల్లిలో పోస్ట్‌మాస్టర్ ద్వారా పింఛన్ దారులకు పింఛన్ పంపిణీ నిర్వహించారు. దీంతో ఇకపై పింఛన్ కోసం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్పంచ్ అనితకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ ఎండి. జానీ, గ్రామస్తులు, వృద్ధులు, పింఛన్ దారులు తదితరులు పాల్గొన్నారు.


Comments