కుషాయిగూడ లో ఫంక్షన్ హాల్ యజమానులతో పోలీసులు సమావేశం
_రాత్రి 10 తర్వాత శబ్ద కాలుష్యం, బాణాసంచాపై కఠిన చర్యలు: పోలీసులు
కుషాయిగూడ, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉన్న అన్ని ఫంక్షన్ హాళ్ల యజమానులు, మేనేజర్స్ తో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి శబ్ద కాలుష్యం జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా శబ్ద నియంత్రణ నిబంధనలను పాటించాలని సూచించారు. అనుమతులు లేకుండా డీజేలు వినియోగించడం, నిషేధిత సమయాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొని, చట్టాలు, నిబంధనలపై ఫంక్షన్ హాల్ యజమానులు,మేనేజర్స్ కు అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు.


Comments