మనిగిల్లలో ప్రజా సమస్యలపై దృష్టి 

మార్నింగ్ వాక్ లో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ 

మనిగిల్లలో ప్రజా సమస్యలపై దృష్టి 

పెద్దమందడి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

 పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు ఉపసర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించి, ఎనిమిదో వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.గ్రామ అభివృద్ధికి ప్రజల సూచనలు ఎంతో కీలకమని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పేర్కొంటూ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.ప్రజలతో నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మనిగిల్ల గ్రామ బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా 2వ వార్డు నెంబర్ శ్రీకాంత్ రెడ్డి, బోయిన కృష్ణయ్య, బీకే ప్రేమ్ కుమార్ రెడ్డి, బోడి గణేష్, కావలి శివ శంకర్, మండల తిరుపతయ్య, ఎం. రవికుమార్, మందడి సాయి కుమార్, ఉప్పరి శివకృష్ణ, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .