అంగన్వాడి కేంద్రం సందర్శించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని రెండో అంగన్వాడి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల సంఖ్య, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వయసు గల చిన్నారులకు అందిస్తున్న తోడ్పాటు పోషకాహార పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు.
పోషకాహారం సరఫరా ఎలా జరుగుతోందనే అంశంపై సర్పంచ్ వివరాలు తెలుసుకొని, నిర్వహణపై తల్లిదండ్రులను అడిగి వారి అభిప్రాయాలను సేకరించారు. విద్యార్థులు మరియు గర్భిణీ స్త్రీలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేయడం జరిగినది. అలాగే తల్లిదండ్రులు ప్రతి నెల అందించే పాలు, గుడ్లు, బాలామృతాన్ని సకాలంలో తీసుకొని పిల్లలను ఆరోగ్యంగా ఉంచే విధంగా ప్రతిరోజూ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సూచించారు.
అంగన్వాడి ఉపాధ్యాయులు విధిగా విద్యార్థులు మరియు గర్భిణీ స్త్రీల ఇళ్లకు వెళ్లి పోషకాహార పంపిణీ చేయాలని సర్పంచ్ సూచించారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు వార్డు సభ్యుడు మద్దిరాల శ్రీకాంత్ రెడ్డిని అంగన్వాడి ఉపాధ్యాయురాలు ప్రేమిల, ఆశా కార్యకర్త బాలమ్మ మరియు విద్యార్థులు శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యుడు మద్దిరాల శ్రీకాంత్ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు
నస్రీం బేగం, గ్రామ పెద్ద రాములు, యువకులు శరత్ రెడ్డి, మల్లికార్జున్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments