కీసర సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వసంత బాధ్యతలు స్వీకరణ
Views: 16
On
కీసర, డిసెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్ గా వసంత శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం డీసీ వసంత మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలన అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రతి సమస్యపై సత్వర స్పందనతో పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పరిపాలన సాగిస్తామని ఆమె తెలిపారు. కీసర సర్కిల్‌ను శాంతియుతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజల సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని వసంత స్పష్టం చేశారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Jan 2026 22:11:38
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....


Comments