ఉప్పల్ ఓల్డ్ భరత్ నగర్‌కు రూ.13.25 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భారీ నిధులు
ఉప్పల్, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఓల్డ్ విలేజ్‌లు, మురికివాడలకు సువర్ణావకాశాలు లభిస్తున్నాయని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.మురికివాడలు, ఓల్డ్ కాలనీల అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అవసరమైన నిధులను రాబట్టి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉప్పల్ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు అవుతున్నాయని చెప్పారు.నియోజకవర్గంలోని ఓల్డ్ విలేజ్‌లు, మురికివాడల అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేపడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.ఓల్డ్ భరత్ నగర్‌లో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులు ఉప్పల్ ఓల్డ్ విలేజ్ భరత్ నగర్‌లో రూ.1.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం మందుముల పరమేశ్వర్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, ఏఈ రాజ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఓల్డ్ భరత్ నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.12 కోట్లతో పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టామని తెలిపారు. మొత్తంగా రూ.13.25 కోట్లతో భరత్ నగర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు.ఇదే తరహాలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో ఉన్న ఓల్డ్ కాలనీలు, మురికివాడలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భూసం రఘునాథ్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, గొరిగే చిరంజీవి, సల్ల రాజేందర్ రెడ్డి, బింగి రమేష్, పప్పది రాకేష్ రెడ్డి, నరసింహ గౌడ్, బాలరాజు గౌడ్, అన్నపురెడ్డి వెంకటరెడ్డి, దొడ్ల రాజు, తెలకల రామ్ రెడ్డి, తెలకల వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, దాసరి కనకయ్య, తెలకల సుధాకర్ రెడ్డి,
ప్రశాంత్ రెడ్డి, కిషోర్, ఓంకార్, బింగి రమేశ్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ రామ్, లక్ష్మణ్, కిరణ్, విజయ్, కర్నాకర్, హరిష్, బర్ల పరమేష్‌తో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments