నాచారంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
నాచారం, జనవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.86 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.రూ.33 లక్షలతో సాయి నగర్ చౌరస్తా నుంచి పలాజో ఈస్ట్ గేట్ వరకు, అలాగే సాయి నగర్ కమ్యూనిటీ హాల్ వరకు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా రూ.53 లక్షల వ్యయంతో శ్రీ రాఘవేంద్ర నగర్‌లోని వీధి నంబర్లు 3, 4, 5, 7లలో నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ కలిసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ముందుగా డ్రైనేజీ పనులు పూర్తిచేసి అనంతరం రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు సాయి నగర్, శ్రీ రాఘవేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి, కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ రమేష్ బాబు, డీఈ ఉమామహేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


Comments