గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం బృందం
Views: 19
On
కాజీపేట్, జనవరి 6 (తెలంగాణ ముచ్చట్లు)
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు 5000 మంది కళాకారులతో కూచిపూడి కళా వైభవం - 2 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాజిపేటకు చెందిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం గురువు రేవతి శిష్య బృందం కూడా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి హాజరై పిల్లలు అన్ని రంగాలలో రాణించాలని ఈ సందర్భంగా తెలిపారు. పిల్లల్ని ఈ రంగంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను గురువులను ఆయన అభినందించారు. అనంతరం గురువులకు పిల్లలకు ప్రశంస జ్ఞాపికలను అందించారు. ఈ అవార్డు రావడం పట్ల స్థానిక లు హర్షం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments