మోజర్ల గ్రామంలో ఘనంగా ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ రాయికంటి రాములు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని, గ్రామస్తులందరూ కలిసి పనిచేస్తే మోజర్ల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజలతో కలిసి ముందుకు సాగుతూ, పంచాయతీ సభ్యుల సహకారంతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.అనంతరం గ్రామస్తులు, అధికారులు నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచిగా రాయికంటి రాములు యాదవ్, వార్డు సభ్యులుగా ఆడెం లక్ష్మి, వాకిటి స్వర్ణలత, మద్దల ఆంజనేయులు, గట్టు సతీష్, గట్టు వరలక్ష్మి, గట్టు నాగమన్నెమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గట్టు మన్యం, మాజీ సర్పంచ్ సునీత తిరుపతయ్య, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు దయాకర్ ,పెద్దమందడి
మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,గ్రామ పెద్దలు బిక్షపతి, నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి, రాములు యాదవ్, ఆంజనేయులు, గట్టు వెంకటన్న, రాజా వర్ధన్ రెడ్డి, మార్చ రవీందర్ ,గట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments