తాటికాయల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు

మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన వార్డు మెంబర్లు 

తాటికాయల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు

ధర్మసాగర్,జనవరి03(తెలంగాణ ముచ్చట్లు):

తాటికాయల గ్రామంలోని ప్రభుత్వ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ 3వ, 8వ వార్డు సభ్యులు పట్ల రమేష్, బొల్లెపాక అనిత సంపత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం మహిళా ఉపాధ్యాయులతో కేకు కట్ చేయించి వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ మాట్లాడుతూ, మహిళా విద్యకు సావిత్రి భాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో విద్య ద్వారా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆమె చేసిన కృషి నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.
వార్డు సభ్యులు పట్ల రమేష్, బొల్లెపాక అనిత సంపత్ మాట్లాడుతూ, మహిళల విద్యాభివృద్ధికి సావిత్రి భాయి పూలే చూపిన దారి ప్రతి ఒక్కరూ అనుసరించాలని తెలిపారు. విద్యే సమాజ పురోగతికి మూలాధారమని, విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్ కుమార్, వసుందర, శ్రీనివాస్, రాజు, ఇందిరాణి, కల్యాణ్, పీఎస్ హెచ్ఎం వెంకటేశ్వరరెడ్డి, రాజు, హేమలత,గ్రామ యువకులు IMG-20260103-WA0126IMG-20260103-WA0130బొల్లెపాక రమేష్,ప్రవీణ్,నవీన్,నల్ల సుకుమార్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .