నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రజా నమ్మకాన్ని నిర్వర్తించాలి..
రేపల్లెవాడ సర్పంచ్ మడిపల్లి. అంబికాకు సన్మాన కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ..
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 21(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండలంలో ప్రతి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఓటు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని బాధ్యతతో నిర్వర్తించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మండల పరిధిలో రేపల్లెవాడ గ్రామం పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవంగా కావడంతో సర్పంచ్ కి ఘన సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, చింతకాని మండలంలో 26 గ్రామపంచాయతీలలో సిపిఐ కాంగ్రెస్ పొత్తుల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థు అందరు కూడా తమ గ్రామాలను అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్వారా నిధులు మంజూరు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్క సర్పంచ్ ఉప సర్పంచ్లు బాధ్యతతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అంతేకాకుండా రాజకీయాల కతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చి అందరు మనసుల్లో మీరు గుర్తుండిపోయేలా చూసుకోవాలన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజలు మిమ్మల్ని ఆదరించేలా చూసుకోవాలని, ఎక్కడా కూడా విమర్శలకు తావు లేకుండా చూసుకోవాలని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకొని ప్రజల మనల్ని పొందాలని తెలిపారు. ప్రజలకు ఎంత సేవలందించిన ఎన్నికల నన్ను మర్చిపోరని సేవలకు తగిన ప్రతిఫలాన్ని ప్రజలు అందిస్తారని ఆయన తెలిపారు సేవ చేసిన నాయకుడిని గుర్తించే విషయంలో ప్రజలకు ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులు మండల నాయకులు రేపల్లెవాడ గ్రామం నుండి ఏకీభవంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మడిపల్లి భాస్కర్ గౌడ్ కోడలు మడిపల్లి అంబికా కు ఘనంగా సాలవులతో బొకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ మక్కపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు దూసరి.నేతాజీ, పర్స.రామచంద్ర రావు, ఆవుల. నరసింహారావు, గాదె. రాముడు, కొప్పుల రజిని,కొప్పుల గోవిందరావు, కూరపాటి కిషోర్, సిపిఐ మండల కార్యదర్శి దూసరి. గోపాలరావు, తోటకూరి. హరీష్, ఆళ్ల రవీంద్ర, బీసీ సెల్ మండల అధ్యక్షుడు చట్టు వెంకటేశ్వర్లు, బందెల.నాగర్జున తిరుపతి గోవిందరావు, రామకృష్ణ పరమ సొసైటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, మంకెన. నాగేశ్వరరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments