చంద్రపురి కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Views: 2
On
నాగారం, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం జీహెచ్ఎంసి పరిధిలోని చంద్రపురి కాలనీలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నాగారం జీహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, అన్నం రాజ్ సుమిత్ర సురేష్, చిన్నం రాజ్ సతీష్ గౌడ్, గణపురం కొండల్ రెడ్డి, దాసోహం నర్సింగ్ రావు, బద్రు నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Dec 2025 12:07:02
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం
ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...


Comments