పామిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన
ఎమ్మెల్యే మేఘా రెడ్డి
పెద్దమందడి,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మధిర మంజుల శ్రీశైలం ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
నూతన సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments