సిపిఐ విజయ వరంపరను కొనసాగించండి.
ఆవుల నర్సింహారావును భారీ మెజార్టీతో గెలపించాలి.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;
బస్వాపురం గ్రామపంచాయతీలో సిపిఐ విజయ వరంపరను కొనసాగించి ఆవుల నర్సింహారావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు బస్వాపురం ఓటర్లను కోరారు. సిపిఐ సర్పంచ్ అభ్యర్ది ఆవుల నర్సింహారావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం బస్వాపురం గ్రామంలో కూనంనేని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బస్వాపురంలో గత రెండు దశాబ్దాలుగా సిపిఐ పార్టీ గెలుస్తుందని తిరిగి నర్సింహారావును గెలిపించి సిపిఐ వందేళ్ల వేడుకకు కానుకగా ఇవ్వాలని కోరారు. బస్వాపురంలో ప్రతి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్ధులను ఆదర్శిస్తున్నారని అభివృద్దే ధ్యేయంగా గత ఇరవై ఏళ్లుగా సిపిఐ సర్పంచ్ లు ఆవుల సైదులు, ఆవుల నర్సింహారావు, బొడ్డు సుగుణమ్మ, రాసాల సాంబలక్ష్మి బస్వావురం అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారని, యువకుడు, స్నేహశిలి నర్సింహారావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తిరిగి బస్వాపురం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే పగటి వేషగాళ్లను నమ్మవద్దని అభివృద్ధికోసం, ప్రజా సమస్యల కోసం కృషి చేసే నర్సింహారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తటి వెంకటేశ్వర్లు, పావులూరి మల్లిఖార్జునరావు, పగడాల మల్లేష్, జిల్లా సమితి సభ్యులు రాసాల మోహన్ రావు,, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, సహాయ కార్యదర్శి మార్గం శ్రీను, మాజీ ఎంపీపీ కన్నెబోయిన విజయమ్మ, మాజీ సర్పంచ్ లు బొడ్డు సుగుణమ్మ కొండలరావు, రాసాల సాంబలక్ష్మీ, శాఖ కార్యదర్శి బద్దల నర్సింహారావు, మామిడాల యాలాద్రి ఉయ్యాల బోడయ్య, పొట్టపల్లి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments