భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీ

జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ బి–బ్లాక్ అధ్యక్షురాలు ఈగ శ్వేత రాజు

భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీ

దమ్మాయిగూడ, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ హమ్మద్‌గూడ, బండ్లగూడ డబుల్ బెడ్‌రూమ్ ఫేజ్–వన్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ బి–బ్లాక్ అధ్యక్షురాలు ఈగ శ్వేత రాజు చేతుల మీదుగా కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా ఈగ శ్వేత రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వెల్ఫేర్ బోర్డు పథకాలు అందాలంటే ప్రతి కార్మికుడు, కార్మికురాలు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది పేద కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న సీఐటీయూ సంఘాన్ని ఆమె అభినందించారు.అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతకింది అశోక్ మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి పథకాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల నివాస ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని కార్మిక శాఖను కోరారు.మ్యారేజ్ గిఫ్ట్, మెటర్నిటీ బెనిఫిట్ సహాయాన్ని రూ.50 వేల వరకు పెంచాలని, కార్మికుల పిల్లలకు ప్రతి నెల ఇస్తామన్న రూ.800 స్కాలర్‌షిప్‌కు స్పష్టమైన విధివిధానాలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వైద్య పరీక్షల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అధికంగా చెల్లింపులు చేయడాన్ని తప్పుబట్టారు. వెల్ఫేర్ బోర్డు నిధులు పూర్తిగా కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, సి.ఎస్.సి సంస్థను రద్దు చేయాలని కోరారు.అలాగే భవన నిర్మాణ కార్మికులందరికీ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసి ఉపాధి కల్పించాలని, వలస కార్మికులు, అడ్డా కార్మికుల కోసం 120 రోజులతో కూడిన పట్టణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని కార్మిక శాఖను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈగ రాజు ముదిరాజు, విజయ్ కుమార్, పరుశురాం, రాజు, షేక్ నవాబ్, ప్రసాద్, లక్ష్మీ ప్రసన్న, వసంత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం