అభివృద్ధే శ్వాసగా పనిచేయండి

సిపిఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు

అభివృద్ధే శ్వాసగా పనిచేయండి

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)

అభివృద్దే శ్వాసగా పనిచేస్తే .. ప్రజలే తరతరాలు ఆదరిస్తారని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం చింతకాని మండలం బస్వాపురం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారాణికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత గ్రామ వత్యేకాధికారిణి మానస నూతన పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాసాల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో పువ్వాడ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి బస్వాపురం సిపిఐ కంచుకోట అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశానని దాంతో ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తనను ఆదరిస్తారన్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని బస్వాపురం గత ఇరవై ఏళ్లుగా సిపిఐ గెలుస్తోందని తిరిగి మరలా ఐదవసారీ సిపిఐ గెలవడం అభినందనీయమన్నారు. రాజకీయలకతీతంగా అభివృద్ధి చేసి ప్రజలతో మమేకం అవ్వాలని నూతన పాలకమండలికి సూచించారు. కేక్ కట్ చేసి నూతన పాలకమండలికి తినిపించారు. అనంతరం గ్రామస్ధులు పువ్వాడను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కూచిపుడి రవి, పావులూరి మల్లిఖార్జునరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాసాల మోహన్ రావు, మండల సహాయ కార్యదర్శి మార్గం శ్రీను, నూతన సర్పంచ్ ఆవుల నర్సింహారావు, మాజీ ఎంపీపీ కన్నెబోయిన విజయమ్మ, మాజీ సర్పంచ్లు రాసాల సాంబలక్ష్మి, బొడ్డు నుగుణమ్మ కొండలరావు, ఉపనర్పంచ్ చంద్రకాని నర్సింహారావు, వార్డు సభ్యులు, సిపిఐ శాఖ కార్యదర్శి బద్దల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం