అయ్యప్ప స్వామి పడిపూజా
కార్యక్రమంలో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్‌వి నగర్ కాలనీలో సోమవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కాలనీ వాసులు గుండెల్లి కొమరయ్య–యాదమ్మ దంపతుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి భక్తి, నియమ నిష్ఠలు సమాజానికి ఆదర్శమని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నెమలి రవి కుమార్‌తో పాటు స్థానిక నాయకులు అల్లాడి కృష్ణ యాదవ్, నెమలి శ్రవణ్, నాగరాజ్, మధు యాదవ్, రాము తదితరులు పాల్గొన్నారు. అలాగే కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments