ప్రమాణ స్వీకారోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు

ప్రమాణ స్వీకారోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ధర్మసాగర్,డిసెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు తెలిపారు.ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, పూర్తి క్రమశిక్షణతో జరగాలన్నారు. ఈ సందర్భంగా డీజేలు, భారీ శబ్ద వ్యవస్థలు వినియోగించరాదని, అలాగే ర్యాలీలు నిర్వహించడం, రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
పోలీసు శాఖ జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించి ప్రమాణ స్వీకారోత్సవాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .