శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి విశేష స్పందన

శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి విశేష స్పందన

నాచారం, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం ప్రాంతంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సత్య సాయి బాబా సేవ సమితి, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో దాదాపు 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అదనంగా కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉచిత కంటి అద్దాలు కూడా పంపిణీ చేశారు.ఉచితంగా వైద్యం, మందులు, కంటి అద్దాలు అందించడంపై స్థానిక పేద ప్రజలు నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం  అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, అధ్యక్షుడు బండల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బొగ్గారపు రమేష్, కోశాధికారి ఎగిన భాస్కర్, ఉపాధ్యక్షుడు గౌరి శెట్టి నరేందర్, సలహాదారులు జూలూరి శ్రీనివాస్, ఎం. రమేష్, జాయింట్ సెక్రటరీ గుండా మహేశ్వమూర్తి, మీడియా కోఆర్డినేటర్ ఆకుతోటి హరిష్ పాల్గొన్నారు.
అలాగే కార్యవర్గ సభ్యులు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, సాయి బాబా, శ్రీశైలం, వైద్యులు డా. రాజేంద్ర ప్రసాద్, డా. ఉపేందర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .