జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
Views: 4
On
ధర్మసాగర్,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత ప్రాజెక్టులు మరియు చార్టుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత నమూనాలు, చార్టులు, వర్కింగ్ మోడళ్లు అందరి ప్రశంసలు పొందాయి.
ఈ కార్యక్రమాన్ని గణిత ఉపాధ్యాయురాలు కిరణ్మయీ సమర్థవంతంగా సమన్వయం చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ప్రధానోపన్యాసాన్ని ప్రధానోపాధ్యాయులు కె.బి. ధర్మ ప్రకాశ్ అందిస్తూ, గణిత శాస్త్రం దైనందిన జీవితంలో ఉన్న ప్రాధాన్యతను వివరించి, విద్యార్థులు తార్కిక ఆలోచన అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కవిత, రాజమ్మ, పద్మజ,
రామకృష్ణ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Dec 2025 12:07:02
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం
ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...


Comments