జయగిరి గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవం. 

జయగిరి గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవం. 

 సర్పంచ్ గా తాళ్లపల్లి వెంకటేశ్వర్లు.
 ఉప సర్పంచ్ గా భూక్యా అరుణ్.

 హసన్ పర్తి,డిసెంబర్ 22( తెలంగాణ ముచ్చట్లు):

 హసన్ పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో డిసెంబర్ 14న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాళ్లపల్లి వెంకటేశ్వర్లు సర్పంచ్ గా పోటీ చేసి విజయం సాధించారు.ఈ క్రమంలో సోమవారం రోజున స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి రవీందర్ సర్పంచ్ గా తాళ్లపల్లి వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ గా భూక్య అరుణ్ 10 వార్డుల సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కట్టుబడి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందజేస్తానని ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని వార్డు సభ్యులు,గ్రామ ప్రజల సహకారంతో ఉత్తమ గ్రామంగా జయగిరిని  తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తకొండ సుభాష్,పిట్టల రాజు,పంజాల కుమారస్వామి,బొజ్జ అశోక్,కొంగంటి మొగిలి,బొజ్జ రాజ్ కుమార్,యాటకాల సుమన్, తాళ్లపల్లి బాలకృష్ణ,వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.IMG-20251222-WA0138

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .