అభివృద్ధి,శుభ్రత,విద్య,ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు.
నాగారం సర్పంచ్ లావణ్య ప్రమాణస్వీకారం.
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైన సందరాజు లావణ్య - సంతోష్,ఉప సర్పంచ్,వార్డు సభ్యుల చేత అధికారులు ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్న పేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
గ్రామాభివృద్ధి,ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ పనిచేయాలని,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని సూచించారు.గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి,శుభ్రత,విద్య,ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.అలాగే ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.గ్రామంలో ప్రధాన సమస్య అయిన కోతులు సర్పంచ్ అయిన మరుసటి రోజున కొండెంగను తెప్పించి కోతులను పట్టించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారని అలాగే గ్రామంలో రోడ్లు డ్రైనేజీల సమస్యలు అన్నింటినీ పూర్తి చేస్తానని సర్పంచ్ లావణ్య గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments