కాకరవాయి మత్స్యకారుల సొసైటీ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ.

కాకరవాయి మత్స్యకారుల సొసైటీ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ.

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 21.*(తెలంగాణ ముచ్చట్లు)

మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా కాకరవాయి మత్స్యకారుల సొసైటీ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకరవాయి ప్రాంతంలోని పలు చెరువుల్లో చేప పిల్లలను విడిచిపెట్టారు.కాకరవాయి మద్దుల చెరువు, గుడి చెరువు, ముజాహిద్‌పురం పెరికల చెరువుల్లో సొసైటీ ఇన్‌చార్జ్ తబడబోయిన కృష్ణ ఆధ్వర్యంలో మొత్తం రెండు లక్షల నలభై ఐదు వేల (2,45,000) చేప పిల్లలను మత్స్యకారులు చెరువుల్లో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో చేపల ఉత్పత్తి పెరిగి మత్స్యకారుల ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపారు..ప్రభుత్వం మత్స్యకారులకు  అందిస్తున్న  సహకారం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం  మత్స్యకారులు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మత్స్యకారులకు భరోసా కలిగిస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం మత్స్య సంపద పెంపొందించడంలో కీలకంగా నిలుస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలి ఎల్లయ్య, మండలి వెంకన్న  తవడబోయిన నవీన్, మోర ఉప్పలయ్య, మోర గణేష్,యాట పెంటయ్య, తవడబోయిన మల్సుర్, తవడబోయిన మధు, తవడబోయిన సాయి తదితరులు పాల్గొన్నారు..

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం