లూర్ధుమాత చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి
రామంతాపూర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చర్చి కాలనీలోని లూర్ధుమాత చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. లుకాస్ ఆధ్వర్యంలో పేదలకు బట్టలు పంపిణీ చేశారు.ఫాదర్ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పరమేశ్వర్ రెడ్డి పాల్గొని, క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జానీ, సుధాకర్, సతీష్, వినోద్, డేవిడ్, ప్రవీణ్ కుమార్, భాస్కర్, రత్నారెడ్డి, లుద్ది రెడ్డి, వినయ్, కిరణ్, రాజు, చోటు, చిన్నారావు, రాయన్నలతో పాటు చర్చి ఫాదర్స్ ఫాదర్ ఆనంద్, ఫాదర్ సందీప్, ఫాదర్ ప్రవీణ్ ప్రాంచి తదితరులు పాల్గొన్నారు.సెమీ క్రిస్మస్ వేడుకలు సోదరభావం, సామాజిక సేవా కార్యక్రమాల తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


Comments