నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం
ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక చర్చకు దారితీసిన అంశం ఏమిటంటే, ఇదే వార్డుకు గతంలో రాజారపు రమా భర్త రాజారపు సుమన్ వార్డు మెంబర్‌గా పనిచేసి ప్రజలకు సేవలు అందించడమే. నాడు భర్త ప్రజాప్రతినిధిగా పనిచేయగా, నేడు భార్య అదే బాధ్యతను స్వీకరించడం గ్రామంలో రాజకీయ పరంపరగా నిలిచింది.
ప్రమాణస్వీకార అనంతరం రాజారపు రమా మాట్లాడుతూ, తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని అన్నారు. గతంలో తన భర్త వార్డు అభివృద్ధి కోసం చేసిన సేవలు తనకు ప్రేరణగా నిలిచాయని, అదే బాటలో నడుచుకుంటూ ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.
ప్రజలు ఎప్పుడైనా తనను సంప్రదించేలా అందుబాటులో ఉంటానని, వార్డు అభివృద్ధే లక్ష్యంగా పారదర్శకంగా పని చేస్తానని రాజారపు రమా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, వార్డు ప్రజలు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments