కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ పాలకవర్గం ఘన ప్రమాణ స్వీకారం.!

కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ పాలకవర్గం ఘన ప్రమాణ స్వీకారం.!

దమ్మపేట, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామస్థుల మధ్య కోలాహల వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ సోయం సత్యవతి, ఉపసర్పంచ్ బుద్దుల శ్రీను, వార్డు సభ్యులు బుద్దుల కృష్ణ, సోయం మేరి, సోయం కృష్ణవేణిలతో గ్రామ పంచాయితీ కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సోయం వీరభద్రం హాజరయ్యారు. అనంతరం మాజీ సర్పంచ్ సోయం రాజుబాబు–రాజేశ్వరి దంపతులతో కలిసి నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌కు జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్, తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలను అందజేశారు. అనంతరం సోయం వీరభద్రం మాట్లాడుతూ, కొమ్ముగూడెం గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు పాలకవర్గం సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ దమ్మపేట మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కీసరి మల్లికార్జునరావు, ఉకే రాఘవయ్య, నరసింహారావు, జోనుబోయిన సుబ్బారావు, పద్దం రాజ్యలక్ష్మి, సోయం రాముడు, బజారు, సుగ్గుల పుల్లారావు తదితరులు పాల్గొనగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.IMG-20251222-WA0147

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం