సోలిపూర్ గ్రామ పాలనకు నూతన శకం..

సర్పంచ్ సింధుజా రెడ్డికి ఎమ్మెల్యే  అభినందనలు

సోలిపూర్ గ్రామ పాలనకు నూతన శకం..

ఖిల్లా ఘనపూర్,డిసెంబర్(22 తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన సింధుజా రెడ్డిని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్ పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. సోలిపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.నూతన సర్పంచ్ సింధుజా రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .