గంగారం గ్రామంలో కొత్త పంచాయతీ సభ్యులు ప్రమాణ స్వీకారం.!
- సర్పంచ్‌గా కాకర్ల రేవతి,
- ఉపసర్పంచ్‌గా బెజవాడ రాధ.
సత్తుపల్లి, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాసరి మధుమోహన్ రెడ్డి ప్రోత్సాహంతో కాకర్ల రేవతి సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
సోమవారం పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాకర్ల రేవతి, ఉపసర్పంచ్ బెజవాడ రాధ, మరియు 12 మంది వార్డ్ మెంబర్లకు గ్రామ పంచాయతీ కార్యదర్శి మద్దెల రవి చేత ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
కార్యక్రమంలో గంగారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై, కొత్తగా ఎన్నికైన సభ్యులను అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సమగ్ర ప్రయత్నాలు చేయాలని ఆకాంక్షించారు.
సర్పంచ్ కాకర్ల రేవతి మాట్లాడుతూ, గ్రామ ప్రజల విశ్వాసం మా మీద ఉంది. గ్రామ అభివృద్ధికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అని తెలిపారు.


Comments