వెల్టూర్ గ్రామ నూతన సర్పంచ్ అశోక్ ను సన్మానించిన జిల్లా మత్స్య సహకార సంఘం
పెద్దమందడి,డిసెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైన ముదిరాజ్ ముద్దుబిడ్డ దండు అశోక్ కుమార్ (చిట్టి) ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా మత్స్య సహకార సంఘం గౌరవ సలహాదారు సుక్క శేఖర్ తో కలిసి జిల్లా ప్రధాన ప్రోత్సాహకులు పుట్ట బాలరాజు సర్పంచ్ అశోక్ కుమార్ ను ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం సర్పంచ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ..తన విజయం కోసం హహర్నిశలు కృషి చేసిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోత్సాహకులు సంద రంగస్వామి, ఉందేకొట్టి నాగేంద్రం, సొప్పరి బీచుపల్లి, సంగనమోని మనోహర్, సంఘం జిల్లా నాయకులు గట్ల ఖానాపూర్ మాజీ సర్పంచ్ కోట్ల వెంకటేష్, మేకల వెంకటస్వామి, వాకిటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments