ఎమ్మెల్యే కడియం సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
తాటికాయల ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణ
ధర్మసాగర్,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని తాటికాయల గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య సహకారంతో రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని తాటికాయల ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణ తెలిపారు.సోమవారం పదవీ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాలు, పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రజల సహకారంతో పనిచేస్తానని తెలిపారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శక పాలన అందిస్తామని, ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానని ఉపసర్పంచ్ శివకృష్ణ పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయడమే తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్, మాజీ ఉపసర్పంచ్ బొల్లెపాక అన్నపూర్ణ కుమార్, వార్డు సభ్యులు పెసరు స్వామి, దువ్వల సుమన్,పిట్టల బిట్టు,పెసరు కృష్ణవేణి,బొల్లెపాక అనిత సంపత్, పట్ల యాదమ్మ రాంచందర్, పట్ల రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్ల మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్
నాయకులు బొల్లెపాక నగేష్, పట్ల శ్రీనివాస్, నల్ల రమేష్, పట్ల రాజమౌళి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments