గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు.
- శ్రీ చైతన్య కరికులంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహణ.
సత్తుపల్లి, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహణ ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న భారత గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులు గణిత ప్రతిజ్ఞతో అసెంబ్లీని ప్రారంభించారు. అనంతరం మాథ్స్ ఫేర్, గణిత రంగవల్లులు, క్విజ్ పోటీలు, గణిత మోడల్ ప్రదర్శనలు వంటి ఆకర్షణీయ కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి పాఠశాల నిర్వహణ అభినందించింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగరాజు మాట్లాడుతూ, గణితం దైనందిన జీవితంలో కీలకమైన శాస్త్రమని, విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం గణిత అధ్యాపకులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డీన్, సి. ఇన్‌చార్జ్, ప్రైమరీ ఇన్‌చార్జ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments