ఉపసర్పంచ్‌,వార్డు సభ్యులను  సన్మానించిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్

ఉపసర్పంచ్‌,వార్డు సభ్యులను  సన్మానించిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్

ధర్మసాగర్,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

తాటికాయల గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణతో పాటు వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని నాయకులు సూచించారు.ఈ సందర్భంగా భాస్క రవీందర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా అని, పంచాయతీ పాలకవర్గానికి పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.సన్మాన కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణతో పాటు వార్డు సభ్యులు పెసరు స్వామి, దువ్వల సుమన్,పిట్టల బిట్టు,పెసరు కృష్ణవేణి,బొల్లెపాక అనిత సంపత్, పట్ల యాదమ్మ రాంచందర్, పట్ల రమేష్ పాల్గొన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్థులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .