చక్రవర్తి సుపరిచితుడే… జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉద్యమించండి

సీపీఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు

చక్రవర్తి సుపరిచితుడే… జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉద్యమించండి

జర్నలిస్టు పురోగతివాద ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు అవసరం

— టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్–2843) జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు)

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ఉద్యమాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఈ పోరాటంలో భవిష్యత్తులో కూడా తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్– 2843) జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణలు తమ నాయకులతో పువ్వాడ నాగేశ్వర రావును వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొత్తగా ఎన్నిక కాబడ్డ ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజె ఎఫ్ (హెచ్-2843) జిల్లా నాయకత్వానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పురోగతివాద ఉద్యమాలు అత్యంత కీలకమని, సంఘటిత పోరాటాల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. వృత్తిలో భద్రత, అక్రెడిటేషన్, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలను నిర్లక్ష్యం చేయరాదని, వీటిపై నిరంతరంగా ఉద్యమాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా బలంగా ఉంటేనే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ పురోగతివాద దిశలో కార్యాచరణ రూపొందించి, అక్రెడిటేషన్, సంక్షేమ పథకాలు, వృత్తి భద్రత, ఇళ్ల స్థలాలు వంటి అంశాలపై క్రమబద్ధమైన ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. 'చక్రవర్తి సుపరిచితుడే' అంటూ పువ్వాడ నాగేశ్వరరావు వ్యక్తం చేసిన ఆత్మీయత తమకు మరింత ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తికి పూర్తి భరోసా ఇస్తూ, జర్నలిస్టుల హక్కుల పోరాటంలో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. అవసరమైన ప్రతి వేదికపై జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తానని, భావజాల భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ మర్యాదపూర్వక భేటీ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్– 2843) జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, మందడపు మనోహర్, వేల్పుల నాగేశ్వర రావు, టీబీజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, కార్యవర్గ సభ్యులు అమరబోయిన ఉపేందర్, కాసోజు శ్రీధర్, కప్పల మధు, కందరబోయిన నాగకృష్ణ, సుదగాని కరుణాకర్, పొదిలాపు సంతోష్, ఎలుగోటి వెంకట్, గంటేల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మల్లెల శిల్పా, నాయిని స్వాతి, వంగ పుంగమ గౌడ్, చిన్నంశెట్టి రాంబాబు, మామిడాల వీరబాబు, షేక్ సోందుమియా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ భేటీ జర్నలిస్టు ఉద్యమాలకు కొత్త ఉత్సాహాన్నినింపిందని, భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సమిష్టిగా, ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు స్పష్టం చేశారు. IMG-20251222-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం