నేతాజీ గెలువు నేరడ అభివృద్ధికి మలుపు
మా ఇంటి బిడ్డను ఆశీర్వదించండి
నేరడ రోడ్ షోలో మల్లు నందిని, కూనంనేని
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;
నేతాజీ గెలువుతో నేరడ గ్రామ పంచాయతీ అభివృద్ధి మలుపు తిరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, డిప్యుటీ సీఎం సతీమణి మల్లు నందినీ విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేరడ గ్రామపంచాయతీ సిపిఐ అభ్యర్ధి దూసరి నేతాజీ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం నేరడ గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, డిప్యుటీ సీఎం సతీమణి మల్లు నందినీ విక్రమార్క. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షో లో కూనంనేని మాట్లాడుతూ నేతాజీ గెలువుతోనే నేరడ అభివృద్ధి చెందుతుందని గ్రామాభివృద్దే ధ్యేయంగా పనిచేసే నేతాజీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దాదాపు నేతాజీ గెలుపు ఖాయమైందని మంచి మెజార్టీ కోసం ఈ మూడు రోజలు అవిశ్రాంతంగా పనిచేయాలని కార్యకర్తలకు నూచించారు. మల్లు నందిని మాట్లాడుతూ. అధికార పార్టీ బలవర్చిన సిపిఐ అభ్యర్థి నేతాజీ ని గెలిపిస్తే ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన అందరికీ అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నేరడ గ్రామంతో తమకు ప్రత్యేక అనుభంధం ఉందని నేతాజీ మా ఇంటి బిడ్డ అని నేతాజీని భారీ మెజార్టీతో గెలిపిస్తే నేరడ అభివృద్ది భాధ్యత తనదేనని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పావులూరి మల్లిఖార్జునరావు, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి, నాయకులు మడుపల్లి భాస్కర్, మంకెన నాగేశ్వరరావు, మేడ నర్సయ్య కాంగ్రెస్, సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments