బేతుపల్లిలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.!

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పాలన.

బేతుపల్లిలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.!

- నూతన సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్.

సత్తుపల్లి, డిసెంబర్‌ 22 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ మరియు 12 మంది వార్డు సభ్యులు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ కార్యదర్శి కె. వెంకట జోగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జీపీ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎన్. రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా సర్పంచ్‌గా ఎన్నికైన దొడ్డా రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉపసర్పంచ్‌గా ఎన్నికైన చిట్టిమాది చెన్నకేశవులు, తదనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే తమ పాలకవర్గం ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్‌, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులుగా మొదటి వార్డు నుంచి పొదిలి మన్మదరావు, రెండో వార్డు నుంచి మామిళ్ళ వెంకటలక్ష్మి, మూడో వార్డు నుంచి కాకాని శ్రీనివాసరావు, నాలుగో వార్డు నుంచి మన్నేని సరిత, ఐదో వార్డు నుంచి అల్లిక సాంబశివరావు, ఆరవ వార్డు నుంచి పాలకొల్లు తాతారావు, ఏడో వార్డు నుంచి చెన్ను త్రివేణి, ఎనిమిదో వార్డు నుంచి చిట్టిమాది చెన్నకేశవులు, తొమ్మిదో వార్డు నుంచి కోలా కళావతి, పదో వార్డు నుంచి గండిపూడి రమేష్, పదకొండో వార్డు నుంచి గండిపూడి యశోద, పన్నెండో వార్డు నుంచి కుప్పాల ఉమ ఎన్నికయ్యారు.
అధికార పార్టీకి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన దొడ్డా రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్‌గా ఘన విజయం సాధించడంతో పాటు, ఆయనకు మద్దతుగా పోటీ చేసిన 12 వార్డుల అభ్యర్థులు కూడా గెలుపొందడం విశేషం. దీంతో బేతుపల్లి గ్రామ పంచాయతీపై నూతన పాలకవర్గం పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ ఫలితంతో గ్రామంలో కొత్త పాలనపై ప్రజల్లో ఆశలు, ఉత్సాహం వెల్లివిరుస్తున్నాయి.IMG-20251222-WA0108

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం