జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాయకులు

మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మూడవ మహాసభలో ఎన్నికైన నూతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుమ్మడి హరి ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులను అదనపు కలెక్టర్‌కు పరిచయం చేశారు.ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పబ్బు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం జిల్లా కమిటీ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాణావత్ రవి నాయక్ మాట్లాడుతూ, ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్లు, విద్య, ఆరోగ్య భద్రత, రిటైర్మెంట్ ఫండ్స్ వంటి కనీస సౌకర్యాల కల్పన కోసం వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మహిళా జర్నలిస్టులు రక్షణ సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారికి తగిన భద్రతా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని జిల్లా ఉపాధ్యక్షురాలు కుమ్మడి రోజారాణి కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు సబ్బ రాజేందర్, బాలు, జిల్లా కమిటీ సభ్యులు పాండు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, దుర్గాప్రసాద్, గుంటి సహదేవ్, సింగం రాజు, రజనీకాంత్, నరేందర్, రాంబాబు, సత్యనారాయణ, సుధాకర్, మధు యాదవ్, మహేందర్, నర్సింహా, మహమ్మద్ సాహెబ్, విష్ణు, అరుణ్ కుమార్, ఛైతన్య రెడ్డి, బాలకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం