కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో 114 ఫిర్యాదులు స్వీకరణ
సకాలంలో సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు కలెక్టర్
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు)
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 114 అర్జీలు అందాయని ఆయన తెలిపారు.సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో అందిన వినతులపై తీసుకున్న చర్యలను వివరించి, ఒన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశాలుజారీ చేశారు.ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు.
అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.అదనంగా, సీఎంఓ ప్రజావాణి పెండింగ్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలి అని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments