బాల్య దశలోనే విద్యతో పాటు క్రీడలు ప్రాధాన్యమే.
గెలిచిన విజేతలకు బహతులను అందజేసి అభినందనలు తెలిపిన డాక్టర్ గ్రీష్మ, సీఐ ఉస్మాన్ షరీఫ్.
ఖమ్మం బ్యూరో,డిసెంబర్ 21(తెలంగాణ ముచ్చట్లు)
బాల్య దశలోనే విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ప్రాధాన్యమే అని ప్రముఖ గైనిక్ సర్జన్ డాక్టర్ గ్రీష్మ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, స్పందన ఇడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్, అండ్ చైర్మన్ డాక్టర్ ఈడ సామ్యూల్ రెడ్డి
లు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం సమీపంలో గల ఎస్ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం క్రికెట్ నెట్ జట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి జట్లు రెండు కేటగిరీలలో కూడా ఖమ్మం, మాలిక్ తెనాలి జట్లు స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్స్ లో పాల్గొన్నాయి. అండర్ 12 అండర్ 14 కేటగిరిలలో ఈ జట్లు తలపడగా అండర్ 12 విభాగంలో ఖమ్మం జట్టుపై మాలిక్ తెనాలి జట్టు విజయం సాధించగా, అండర్ 14 విభాగంలో మాలిక్ తెనాలి జట్టుపై ..ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నెట్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ యాంత్రిక యుగంలో క్రీడల అంశంలో శారీరక సౌష్టవాన్ని ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఫిజికల్ ఫిట్నెస్ కు అనుగుణంగా క్రీడలు బాల్య దశలోనే ఎంతగానో దోహదపడతాయని వారన్నారు. శారీరక శ్రమతో కూడిన క్రీడలు చిన్నారుల ఎదుగుదలకు ఎంతో తోడ్పాడతాయని చెప్పారు. క్రీడల పట్ల ఎక్కువ మక్కువను చూపుతూ.. విద్యను నిర్లక్ష్యం చేయరాదని విద్యా, క్రీడలు రెండింటిని సమానంగా పరిగణిస్తూ క్రీడాకారుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యకు, క్రీడకు ప్రాధాన్యతను ఇస్తూ.. వారిని ప్రోత్సహించినప్పుడే చిన్నారులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభ, ఉన్నత చదువుల అంశంపై పట్టు సాధించేలా కృషి చేయాలని వారన్నారు..
అనంతరం యువ క్రికెట్ అకాడమీ చైర్మెన్ మాలిక్ (తెనాలి) మాట్లాడుతూ... చిన్నారులు క్రికెట్ పట్ల ఆసక్తితో పాటు క్రీడలో నైపుణ్యతను పెంపొందింప చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు వారు మెడల్స్, జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ నిర్వాహకులు మహమ్మద్ మతీన్, పీఈటీ. ప్రేమ్కుమార్, సీనియర్ జర్నలిస్ట్ జానీపాషా తదితరులు పాల్గొన్నారు.. 


Comments