నాచారంలో శ్రీనివాస టెక్స్టైల్స్
ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి
నాచారం, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
నాచారం మెయిన్ రోడ్‌లో శ్రీనివాస శర్మ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస టెక్స్టైల్స్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యాపార రంగంలో నిర్వాహకులు మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభమైన శ్రీనివాస టెక్స్టైల్స్ విజయవంతంగా రాణించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, నాచారం ప్రాంతంలోని పేదలు, వికలాంగులు, వృద్ధులు, పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వారికి ఉచితంగా బట్టలు అందజేస్తామని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఒక జంటకు బట్టలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Comments