వృద్ధుల మానసిక ఆనందమే మా సేవా లక్ష్యం.!
మెర్సీ హోమ్‌లో 15వ బెటాలియన్ సేవా కార్యక్రమం.
సత్తుపల్లి, డిసెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం, బి గంగారం 15వ బెటాలియన్ అధికారులు, సిబ్బంది సేవా మనసుతో మరోసారి మానవీయతను చాటుకున్నారు. కమాండెంట్ యన్. పెదబాబు సూచనలతో, అడిషనల్ కమాండెంట్ ఏ. అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్ యస్. శ్రీధర్ రాజా పర్యవేక్షణలో అన్యువల్ రిఫ్రెషర్ కోర్స్ కార్యక్రమంలో భాగంగా సీ కంపెనీ బృందం మంగళవారం వెంసర్‌లోని వృద్ధాశ్రమం ‘మెర్సీ హోమ్’ను సందర్శించింది. వృద్ధుల్ని ఆదరాభిమానాలతో పలకరిస్తూ యస్. శ్రీధర్ రాజా వారితో మనస్పూర్తిగా మాట్లాడారు. అక్కడ ఉన్న పెద్దలకు పండ్లు, కూరగాయలు, సబ్బులు, దుప్పట్లు, నిత్యావసర సామాగ్రిని అందజేశారు. వృద్ధులలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా, అవసరమైన వస్తువులు ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించారు. ప్రతి సంవత్సరమూ జరుగే అన్యువల్ రిఫ్రెషర్ కోర్స్‌లో ఓ అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమాన్ని సందర్శించి సహాయం చేయడం 15వ బెటాలియన్ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొని సేవా కార్యక్రమాన్ని సాఫల్యవంతం చేశారు.


Comments