సోలిపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను 

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సింధుజా రెడ్డి

సోలిపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను 

పెద్దమందడి,డిసెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):

సోలిపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీనేటి సింధుజా రెడ్డి, గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. కత్తెర గుర్తుకు ఓటు వేస్తే, లూటీ చేయడం కాకుండా గ్రామానికి బ్యూటీ చేస్తానని అన్నారు.మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మంగళవారం ఖిల్లా గణపురం మండలంలోని సోలిపూర్‌లో సింధుజా రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధుజా రెడ్డి మాట్లాడుతూ..నా గెలుపుతో గ్రామ ప్రజలకు అన్ని వేళలు అందుబాటులో ఉంటాను. ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో సోలిపూర్ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడతాను అని తెలిపారు.సోలిపూర్‌ను మండల కేంద్రంగా సాధించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, ఇళ్ల లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వ వ్యవస్థలో అధికారం పొందిన ఓ నాయకుడు డబల్ బెడ్‌రూం ఇండ్ల పేరిట ఇసుక అమ్మకాలు చేసి, అవినీతితో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించిన విషయం తీవ్రంగా విమర్శించారు.ప్రజాప్రతినిధులుగా ఎన్నికై హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు, గ్రామానికి దూరమయ్యారు. కానీ నేను గ్రామంలోనే ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటాను. నా పిల్లలు హైదరాబాద్‌లో చదువుతుండడంతో వారిని చూసేందుకు 15 రోజులకు ఒకసారి మాత్రమే వెళ్తాను అని స్పష్టం చేశారు.సోలిపూర్ ప్రజల ఆశీర్వాదంతో తన గెలుపు ఖాయమని తీనేటి సింధుజా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.