గొల్లకృష్ణపల్లిలో నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రమాణ స్వీకారం
Views: 3
On
వేలేరు, 22 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం గొల్లకృష్ణపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బత్తుల శ్రీనివాస్, ఉపసర్పంచ్ జుర్రు అఖిలతో పాటు వార్డు మెంబర్లు అందరూ వేలేరు తహసీల్దార్ కోమి నేతృత్వంలో తమ పదవులకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Dec 2025 12:07:02
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం
ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...


Comments