మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ సీనియర్ సిటిజన్స్‌కు సన్మానం
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కాప్రా, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కాప్రా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు టాస్కా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులు ఎం.వి. రామచంద్రమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం ఎమ్మెల్యే, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లను శాలువాలతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక గౌరవ సన్మానం నిర్వహించారు.ఈ సమావేశానికి మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, కాలనీ అధ్యక్షులు మోర మల్లారెడ్డి, కేఎన్‌ఎస్‌సిడబ్ల్యుఏ మాజీ అధ్యక్షులు నర్ర సుఖేందర్ రెడ్డి, ప్రధాన సలహాదారు పి. లక్ష్మారెడ్డి, హేమంత్ రెడ్డి, లయన్ పి.వి. రమణ, కేఎన్‌ఎస్‌సిడబ్ల్యుఏ ఉపాధ్యక్షులు తదితరులు వేదికపైకి ఆహ్వానించబడ్డారు.
కేఎన్‌ఎస్‌సిడబ్ల్యుఏ మరియు కాలనీ ప్రధాన కార్యదర్శి బి. దేవరాజ్ సంఘం చేపడుతున్న కార్యకలాపాలపై సమగ్ర నివేదికను సమర్పించారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమంపై పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం లయన్ అంజయ్య కృతజ్ఞతల తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో కేఎన్‌ఎస్‌సిడబ్ల్యుఏ ఆర్థిక కార్యదర్శి ఎం.ఎన్. కుమార్, ఉపాధ్యక్షులు ఏ. అంజయ్య తదితర సీనియర్ సిటిజన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments