అల్టిట్యూడ్ హై స్కూల్‌లో ఘనంగా
శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు
ఎల్కతుర్తి, డిసెంబర్ 22: (తెలంగాణ ముచ్చట్లు)
సెయింట్ థామస్ హై స్కూల్‌లో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆటపాటలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని తమ మేధస్సు, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జీవితం, ఆయన సాధించిన ఘనతలు, కష్టపడి చదివి ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా ఎదిగిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. రామానుజన్ జీవితం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, సరిత, ఆశా బేగం, సురేష్, కృష్ణ, కిషోర్, సరిత, కవిత, అనుష
తదితర ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments