బ్యాంకును మోసం చేసిన ముగ్గురిపై కేసు.!
సత్తుపల్లి, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకును మోసం చేసిన ఘటనలో సదాశివునిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ జంగం కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు… సదాశివునిపాలెం గ్రామానికి చెందిన కాల్నెని రాజేశ్ (ఏ–1), కాల్నెని నాగమణి (ఏ–2), కాల్నెని కుమారి (ఏ–3) అనువారు తుంబూరు రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు.
ఈ రుణానికి సంబంధించి ప్రస్తుతం రూ.63,31,269 బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే, బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా అదే భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇతర వ్యక్తులకు విక్రయించి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు నమ్మకద్రోహం, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


Comments